తెలంగాణలో కోల్ టూరిజం ... సింగరేణి దర్శిని బస్సును ప్రారంభించిన బాజిరెడ్డి

Dec 28, 2022, 11:14 AM IST

హైదరాబాద్ : తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసి వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక చరిత్ర కలిగిన బొగ్గుగనులు, కార్మికుల పనితీరు, జీవన విధానం, బొగ్గు సరఫరా జరిగే విధానం... ఇలా మొత్తంగా సింగరేణి ప్రాంతం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ ఆర్టిసి ''సింగరేణి దర్శిని'' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. సింగరేణి యాజమాన్యం సహకారంతో భూగర్భ, ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులను కూడా సందర్శించేలా కోల్ టూరిజం పేరిట డెవలప్ మెంట్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి సింగరేణి ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక బస్సు సర్వీసులను తెలంగాణ ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.