Naresh Kumar | Published: Sep 7, 2023, 1:41 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అవరణ లో ఉన్న దర్గాలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. గత కొంత కాలంగా ఓ వర్గం దర్గాను నిర్వహిస్తుండగా ఇటీవల మరోవర్గం దర్గాపై తమకే హక్కులు ఉన్నాయని హైకోర్టుకి వెళ్లింది. దర్గాపై హక్కులు తమవంటే తమవి అని ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొంది.
పోలీసులు దర్గాకు తాళం వేసి ఇరువర్గాలను బయటకు పంపించారు. దర్గా నిర్వహణపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. దర్గా నిర్వాహణపై సమస్య కోర్టులో పరిష్కరించుకోవాలని సున్నితమైన అంశం అవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఇరువర్గాలను బయటకు పంపించామని పోలీసులు తెలిపారు.