మనుగోడు ప్రచారం పరాకాష్టకు ... జేపి నడ్డాకు సమాధికట్టిన ప్రత్యర్థులు

మనుగోడు ప్రచారం పరాకాష్టకు ... జేపి నడ్డాకు సమాధికట్టిన ప్రత్యర్థులు

Published : Oct 20, 2022, 11:15 AM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది.

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అన్నిపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడమే కాదు ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే ప్రచారాన్ని కూడా అదేస్థాయిలో చేపట్టాయి. అయితే ఈ ప్రచారం కాస్త హద్దులు దాటి పరాకాష్టకు చేరుకుంది. కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయాడంటూ ఏకంగా అయన సమాధి కట్టారు ప్రత్యర్థులు. ఈ వ్యవహారం మునుగోడులోనే కాదు యావత్ తెలంగాణ సంచలనంగా మారింది. నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ సమస్యను పూర్తిగా తొలగించేందుకు చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుచేస్తామని 2016 లో కేంద్ర మంత్రి జేపి నడ్డా హామీఇచ్చారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 8.2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా రీసెర్చ్ సెంటర్ హామీ నేరవేరకపోవడంతో దీన్ని మునుగోడు ఉపఎన్నికలో వాడుకోవాలని బిజెపి ప్రత్యర్థి పార్టీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కోసం కేటాయించిన స్థలంలో జేపి నడ్డా ప్లెక్సీలతో సమాధి ఏర్పాటుచేసారు. 

24:53CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
Read more