అమ్మవారి అవతారాలు - రంగు రంగుకో అర్థం (వీడియో)

అమ్మవారి అవతారాలు - రంగు రంగుకో అర్థం (వీడియో)

Siva Kodati |  
Published : Sep 27, 2019, 01:06 PM ISTUpdated : Sep 27, 2019, 01:11 PM IST

ఆశ్వాయుజమాసంలోని మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా ఆరాధిస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో ఎటు చూసినా రంగులశోభ విరాజిల్లుతుంది. అనేక రంగుల వస్త్రాలంకరణ కూడా కనిపిస్తుంది. అయితే నవరాత్రుల్లో వాడే రంగుల్లో ప్రతి రంగు వెనుకా ఓ అర్థం ఉంది. నవరాత్రుల్లోని ఒక్కో రోజుకు ఒక్కో రంగు ప్రత్యేకం. ప్రతీ రంగు ఆ రోజు అమ్మవారి అవతాకం ప్రత్యేకతను, ప్రాముఖ్యతను తెలుపుతుంది.

ఆశ్వాయుజమాసంలోని మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా ఆరాధిస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో ఎటు చూసినా రంగులశోభ విరాజిల్లుతుంది. అనేక రంగుల వస్త్రాలంకరణ కూడా కనిపిస్తుంది. అయితే నవరాత్రుల్లో వాడే రంగుల్లో ప్రతి రంగు వెనుకా ఓ అర్థం ఉంది. నవరాత్రుల్లోని ఒక్కో రోజుకు ఒక్కో రంగు ప్రత్యేకం. ప్రతీ రంగు ఆ రోజు అమ్మవారి అవతాకం ప్రత్యేకతను, ప్రాముఖ్యతను తెలుపుతుంది.

నవరాత్రుల్లో వాడే నవరంగుల ప్రాముఖ్యత :మొదటిది - పసుపురంగు : నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు శైలపుత్రిలా దర్శనం ఇస్తుంది. పర్వతరాజపుత్రి పార్వతి అవతారం. ప్రకృతి మాత అవతారంగా, శక్తికి ప్రతిరూపంగా కొలుస్తారు. అందుకే పసుపు సంతోషానికి, ఆనందానికి, ప్రకాశానికి చిహ్నంగా భావిస్తారు. 

రెండోది - ఆకుపచ్చ : నవరాత్రుల్లో రెండోరోజు దుర్గామాత బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానార్జనకు ప్రతీక ఈ అవతారం. దుర్గామాత లేదా పార్వతీదేవీ ఈ అవతారంలోనే తపస్సుకోసం వెళ్లిందని అంటారు. ఆకుపచ్చ శక్తికి, ప్రకృతికి, ఎదుగుదలకు చిహ్నం.

మూడోది - బూడిదరంగు : అమ్మవారి మూడో అవతారం చంద్రఘంట. ఈ అవతారంలో అమ్మవారు బూడిదవర్ణంలో ఉండే అర్దచంద్రుడిని నుదిటిమీద ధరిస్తుంది. బూడిదవర్ణం అమ్మవారి మన:స్థితిని ప్రతిబింబిస్తుంది. దీంతోపాటు తన భక్తుల కష్టాలు తీర్చడానికి ఎల్లవేళలా తాను సిద్ధంగా ఉంటాననే విషయాన్ని తెలుపుతుంది.

నాలుగోది - నారింజవర్ణం : నవరాత్రుల్లో అమ్మవారి నాలుగో అవతారం కూష్మాండ. అమ్మవారి ప్రకాశవంతమైన, తేజోవంతమైన ఈ అవతారం సూర్యుడికే వెలుగునిస్తుంది. నారింజరంగు సంతోషానికి, శక్తికి ప్రతిరూపంగా కనిపిస్తుంది.

ఐదోది - తెలుపు : అమ్మవారి ఐదోఅవతారం స్కంధమాత. స్కంధ లేదా కాత్యాయనీ తల్లి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మప్రేమలోని స్వచ్ఛతను ఈ అవతారం ప్రతిబింబిస్తుంది. తెలుపురంగు శాంతిని, స్వచ్ఛతను, ప్రార్థనను సూచిస్తుంది.

ఆరోది - ఎరుపురంగు : నవరాత్రుల్లో అమ్మవారి ఆరో అవతారం కాత్యాయని. దుర్గాదేవి భీకరరూపమే కాత్యాయని. దేవతల కోపానికి ప్రతిరూపంగా ఈ అవతారం ఏర్పడిందని నమ్ముతారు. ఎరుపురంగు తేజస్సుకు, కచ్చితమైన పనికి ప్రతిరూపంగా కనిపిస్తుంది.

02:24వినాయకుడిని పూజించేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఏమిటి..?
02:16దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?
06:13భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు
23:07శ్రీరాముడు స్వయంగా చేసిన విగ్రహం ఈ ఆలయం ప్రశిష్టత
03:14వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి గడప ఎందుకు అవసరం ..?
03:58ఇంటి ముందు వేసే ముగ్గులో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!
35:05అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 5)
32:41అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 3)
29:13అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 2)
04:47ఆషాడ మాసం అమావాస్య శ్రీ మహాలక్షి పూజ ప్రత్యేకత