ఈ దీపావళికి వెలిగిపోండిలా.. (వీడియో)

ఈ దీపావళికి వెలిగిపోండిలా.. (వీడియో)

Siva Kodati |  
Published : Oct 09, 2019, 06:40 PM IST

దీపకాంతుల దీపావళి మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ దీపావళికి అందరికంటే బాగా కనిపించడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీ చర్మం దీపావళి వెలగులతో పోటీపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవి.

దీపకాంతుల దీపావళి మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ దీపావళికి అందరికంటే బాగా కనిపించడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీ చర్మం దీపావళి వెలగులతో పోటీపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవి. 

ఫేస్ ప్యాక్స్ : ఫేస్ ప్యాక్స్ మీ శరీరఛాయను మెరుగుపరుస్తాయి. శనగపిండి, పసుపు, తేనె, రోజ్ పౌడర్లతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవచ్చు. వీటితో పాటు తాజాపండ్లతో కూడా ఫేస్ ప్యాక్ చేయచ్చు. ఇలా తయారుచేసుకున్న ఫేస్ ఫ్యాక్ ను రోజు మార్చి రోజు వాడితే మెరిసిపోయే తాజా ముఖసౌందర్యం మీ సొంతమవుతుంది. అరటిపండు, తేనె కలిపి చేసిన ఫేస్ ఫ్యాక్ ని వేసుకుంటే మీ చర్మం మృధువుగా, సున్నితంగా, మెరిసిపోతూ ఉంటుంది. 

2. క్యాలరీలను అదుపులో పెట్టుకోండి : పానీయాలు, తీపిపదార్థాలు, రకరకాల పిండివంటలు దీపావళికి ప్రత్యేకం. వీటన్నింటిని తీసుకుంటూనే క్యాలరీ డైటింగ్ ఎలా అనేది చూసుకోవాలి. దీనికంటే మంచి పద్ధతి ఏంటంటే సాలడ్స్, తాజా పండ్లతో చేసిన పదార్థాలు తీసుకోవడం మంచిది. మీరు తీసుకునే ఆహారం మీ శరీరం, జుట్టు మీదే కాదు మీ పొట్ట మీద కూడా ప్రభావం చూపిస్తుందన్న విషయం మరిచిపోవద్దు. 

3. పనిలో పడి నీటిని తాగడం మరిచిపోవద్దు. రోజుకు 8,9 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరం, చర్మంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి మెరిసేచర్మం మీ సొంతమవుతుంది.

4. రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా మొహాన్ని కడుక్కోవడం వల్ల ముఖచర్మం శుభ్రంగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువసార్లు కడగకండి. ఫేస్ వాష్ లను వాడడం వల్ల చర్మరంధ్రాలు తెరుచుకుని చర్మం మృధువుగా అవుతుంది.

5. సరైన నిద్ర : రోజుకు ప్రతి ఒక్కరికి 6-8 గంటల నిద్ర అవసరమవుతుంది. నిద్ర సరిపోకపోతే ఆ ప్రభావం ముఖం మీద కనిపిస్తుంది. అంతేకాదు అలిసిపోయినట్టుగా, నీరసంగా కనిపిస్తాం. పడుకున్నప్పుడు చర్మకణాలు శక్తిని పుంజుకుంటాయి. ఆ సమయంలో శరీరంలో రక్త ప్రసరణ చర్మానికి ఎక్కువగా జరుగుతుంది. అందుకే పడుకునేవిషయంలో పిసినారితనం చేస్తే మీ చర్మాన్ని మీరు ప్రమాదంలో పడేసినట్టే.

Ugadi Horoscope: మేష రాశివారికి అద్భుత ఫలితాలు.. విశ్వావసు నామ సంవత్సర పంచాంగం | Asianet Telugu
03:37మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపువాళ్లే డబ్బు చెల్లిస్తారు ఎలాగో తెలుసా?
02:46పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
03:11షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?
03:25బ్యాంకు అకౌంట్‌లో డబ్బు వేస్తున్నారా? ఆ తప్పు చేశారంటే 60శాతం పన్ను కట్టాలి మరి!
03:42అర్జెంట్‌గా బంగారం కొనేయండి.. లేదంటే బాధపడతారు!
03:28మీ పిల్లలు పెళ్లి చేసుకోకపోవచ్చు అప్పుడేం అవుతుందంటే?
02:38భారత్‌లో మంకీపాక్స్.. ఇది కరోనా కంటే డేంజర్!
02:45రోజుకు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా?
02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?