ఉదయాన్నే ఇలా చేస్తే తేలికైన శరీరం మీ సొంతం (వీడియో)

ఉదయాన్నే ఇలా చేస్తే తేలికైన శరీరం మీ సొంతం (వీడియో)

Siva Kodati |  
Published : Oct 11, 2019, 08:23 PM IST

మీరు నమ్మినా నమ్మకపోయినా ఉదయాన్నే మీరు పాటించే కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీ బరువును అదుపులో పెట్టడానికి బాగా పనికివస్తాయి. కొన్ని మంచి అలవాట్లు బరువు తగ్గిస్తే, తెలిసీ తెలియక చేసే కొన్ని చెడు అలవాట్లు బరువును మరింత పెంచడానికి దోహదం చేస్తాయి. అవేంటో చూడండి...

మీరు నమ్మినా నమ్మకపోయినా ఉదయాన్నే మీరు పాటించే కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీ బరువును అదుపులో పెట్టడానికి బాగా పనికివస్తాయి. కొన్ని మంచి అలవాట్లు బరువు తగ్గిస్తే, తెలిసీ తెలియక చేసే కొన్ని చెడు అలవాట్లు బరువును మరింత పెంచడానికి దోహదం చేస్తాయి. అవేంటో చూడండి...
ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే అల్పాహారం తీసుకోవడం : ఉదయం వేళల్లో మానవ శరీరం తేలిగ్గా ఉంటుందనేది నిజమే. అయితే కొవ్వు పదార్థాలు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారంతో నింపేయడం వల్ల శరీరం బరువెక్కుతుంది. అందుకే అల్పాహారంతో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా ఫరవాలేదు. రోజు మొత్తంలో మీరు చేసే పనులతో క్యాలరీలు కరిగించుకునేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. పండ్లు, తాజా రసాలు, గుడ్లు, ఆకుపచ్చటి కూరగాయల్లాంటి ప్రొటీన్ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్ కి మంచిది.

2 ఉదయాన్నే నీరు తీసుకోవాలి. రోజుకు చక్కగా మొదలుపెట్టడానికి ఉదయాన్నే కాఫీనో, టీ నో తాగాలని చాలా మంది అభిప్రాయం. నిజమే కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు కనక బరువు తగ్గాలన్న ప్రయత్నంలో ఉంటే ఉదయం లేవగానే మీరు గ్లాసుడు మంచినీళ్లు తాగడం మంచిది. ఉదయాన్నే తీసుకునే నీటివల్ల శరీరంలోని విషపదార్థాలు బైటికిపోయి శరీరక్రియలు సక్రమంగా జరుగుతాయి. రక్తప్రసరణ అదుపులో ఉంటుంది.

3.బ్రేక్ ఫాస్ట్ కు ముందు వర్కవుట్లు చేయకండి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ కు ముందు వ్యాయామం వల్ల శరీరం ఒకేసారి తీవ్రమైన పని ఒత్తిడికి లోనవుతుంది. శక్తి ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా ఎక్కువగా తినేస్తారు. దీనివల్ల జీర్ణకోశ సంబంధసమస్యలు తలెత్తుతాయి. ఉదయాన్నే ఓ గంట ముందుగా లేచి తొందరగా బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని  వ్యాయామం చేయడం మంచిది. 

4. ధ్యానం చేయడం వల్ల శరీరం, మనసు రెండూ ప్రశాంతంగా మారిపోతాయి. ప్రశాంతమైన, ఏకాగ్రతతతో కూడిన మనసు మిమ్మల్ని మరింత శక్తివంతం చేస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు చేస్తున్న పని ఏంటి, ఎంతవరకు సరిగా చేస్తున్నారు అన్న విషయాల్లో స్పష్టత మీకు లభిస్తుంది. దీనివల్ల ఒత్తిడి దూరమై ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి. అంతిమంగా బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది.

Ugadi Horoscope: మేష రాశివారికి అద్భుత ఫలితాలు.. విశ్వావసు నామ సంవత్సర పంచాంగం | Asianet Telugu
03:37మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపువాళ్లే డబ్బు చెల్లిస్తారు ఎలాగో తెలుసా?
02:46పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
03:11షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?
03:25బ్యాంకు అకౌంట్‌లో డబ్బు వేస్తున్నారా? ఆ తప్పు చేశారంటే 60శాతం పన్ను కట్టాలి మరి!
03:42అర్జెంట్‌గా బంగారం కొనేయండి.. లేదంటే బాధపడతారు!
03:28మీ పిల్లలు పెళ్లి చేసుకోకపోవచ్చు అప్పుడేం అవుతుందంటే?
02:38భారత్‌లో మంకీపాక్స్.. ఇది కరోనా కంటే డేంజర్!
02:45రోజుకు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా?
02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?