బ్రిటీష్ క‌లెక్ట‌ర్ కే పాయింట్ బ్లాక్ లో గ‌న్ పెట్టి కాల్చిన ధీరుడు ‘వంచినాథ అయ్యర్’

బ్రిటీష్ క‌లెక్ట‌ర్ కే పాయింట్ బ్లాక్ లో గ‌న్ పెట్టి కాల్చిన ధీరుడు ‘వంచినాథ అయ్యర్’

Published : Jul 12, 2022, 12:35 PM IST

అది తిరునల్వేలి రైల్వే స్టేషన్. 1911 సంవ‌త‌ర్సం జూన్ 17వ తేదీ. 

అది తిరునల్వేలి రైల్వే స్టేషన్. 1911 సంవ‌త‌ర్సం జూన్ 17వ తేదీ. అక్క‌డి నుంచి కొడైకెనాల్ కు ఒక రైలు బయలుదేరబోతోంది. ఒక వీఐపీ తన భార్యతో కలిసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ ఎక్కారు. వారు రాబర్ట్ విలియం ఆష్ అత‌డి భార్య మేరీ. ఆష్ తిరున‌ల్వేలి జిల్లాకు శ‌క్తివంత‌మైన క‌లెక్ట‌ర్. భారతీయ జాతీయవాదుల అంటే అత‌డికి కోపం. వారిని శ‌త్రువులుగా భావించేవాడు. 

ఈ దంప‌తులు ఎక్కిన అదే రైలులోని వేరే కంపార్ట్ మెంట్ లోకి ముగ్గురు యువకులు కూడా ఎక్కారు. అందులో ఒక‌రు షెంకోటకు చెందిన వంచినాథ అయ్యర్ కాగా మిగిలిన ఇద్ద‌రు ఆయ‌న స్నేహితులు. ఈ రైలు ఉదయం 9.30 గంట‌ల‌కు తూత్తుకుడిలోని మనియాచికి చేరుకుంది. వంచినాథ అయ్యర్ తన కంపార్ట్ మెంట్ లోంచి బయటకు వచ్చి ఫస్ట్ క్లాసులో ప్రవేశించాడు. మెరుపు వేగంతో  ఒక పిస్టల్ ను బయటకు తీసి, క‌లెక్ట‌ర్ ఆష్ నుదిటిపై పాయింట్-బ్లాంక్ గా కాల్చాడు. పని అయిపోయింది, వెంట‌నే అత‌డు రైలు నుంచి దూకి ప్లాట్ ఫారం మీద ఉన్న టాయిలెట్ కు పరిగెత్తాడు. వెంట‌నే ఆ టాయిలెట్ నుంచి తుపాకీ కాల్పులు వినిపించాయి. భార‌తీయులంటేనే శ‌త్రువులుగా భావించే క‌లెక్ట‌ర్ ను చంపిన ఈ 25 ఏళ్ల యువ‌కుడు..బ్రిటీషు సైనికులకు ప‌ట్టుబ‌డ‌టం కంటే మ‌ర‌ణాన్నే ప్రేమ‌గా స్వీక‌రించి అమ‌రుడ‌య్యాడు. 

1905లో బెంగాల్ విభజన వల్ల అనుశీలన్ సమితి, జుగంతర్ పాలనలో విప్లవ జాతీయవాదులు మిలిటెంట్ కార్యకలాపాలు సాగించారు. దక్షిణాన బెంగాల్ కు చాలా దూరంలో ఉన్న తమిళ యువకులు కూడా బెంగాలీ విప్లవకారుల నుండి ప్రేరణ పొందారు. మిలిటెంట్ జాతీయవాద త్రయం లాల్, బాల్, పాల్ లకు కూడా వీరాభిమానులు.  వీరిలో సుబ్రహ్మణ్య భారతి, సుబ్రమణియన్ శివ, వీవో చిదంబరం పిళ్లై, వంచినాథన్ గురువు నీలకాండ బ్రహ్మచారి, వీవీఎస్ అయ్యర్, ఎంపీటీ ఆచార్య తదితరులు ఉన్నారు. ఆ కాలపు బెంగాల్ విప్లవకారుల మాదిరిగానే ఈ తమిళ ఫైర్ బ్రాండ్ ల‌లో ఒక వర్గం తరువాత మార్క్సిజాన్ని స్వీకరించగా, మ‌రో వ‌ర్గం హిందూ మ‌త మార్గంలో ప్ర‌యాణించింది.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...