సంఘ సంస్కరణే జీవితాశయంగా బ్రతికిన మహనీయుడు - వైకుండ స్వామి

సంఘ సంస్కరణే జీవితాశయంగా బ్రతికిన మహనీయుడు - వైకుండ స్వామి

Published : Aug 20, 2022, 04:14 PM IST

అగ్రకులం, మతం ఆధిపత్యం, మహిళలపై అణచివేత, విదేశీ పాలనకు వ్యతిరేకంగా, స్వదేశీ పాలకుల అరాచకాలు.. వీటన్నింటినీ ప్రశ్నించినవారు ఉన్నారా?

అగ్రకులం, మతం ఆధిపత్యం, మహిళలపై అణచివేత, విదేశీ పాలనకు వ్యతిరేకంగా, స్వదేశీ పాలకుల అరాచకాలు.. వీటన్నింటినీ ప్రశ్నించినవారు ఉన్నారా? అంటే చాలా అరుదనే చెప్పాలి. అందులో కచ్చితంగా అయ్య వైకుండార్ స్వామి ఉంటారు. అప్పటి సమాజానికి కనీసం స్పృహ లేని హక్కుల గురించి అణచివేత గురించి ఆయన గళమెత్తారు. 

వైకుండా స్వామి కూడా అని పిలిచే ఆ సంఘ సంస్కర్త కన్యాకుమారి సమీపంలో ఓ చిన్న గ్రామంలో నిమ్న కులం చన్నార్‌‌ కుటుంబంలో 19వ శతాబ్దంలో జన్మించారు. తిరువితంకూర్‌లో వెనుకబడిన కులాల మహిళల ఛాతిపైనా ఏ ఆచ్ఛాదనను అంగీకరించిన కాలం అది. వైకుండ స్వామికి తల్లిదండ్రులు ఓ హిందూ దేవుడి పేరు పెట్టినందుకు అగ్ర కులాల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. దీంతో ముత్తుకుట్టీ అని పేరు మార్చారు.

20వ ఏట వైకుండ స్వామి అనారోగ్యానికి గురైనప్పుడు తిరుచెండూర్‌లోని మురుగ టెంపుల్‌ తీసుకెళ్లారు. అక్కడే ఆయన అన్ని మతాల గ్రంథాలు తిరగేశాడు. అక్కడే ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతుంటారు. దీంతో ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు ఏర్పడ్డారు. ఆయన అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాడరు. సమత్వా సమాజ్‌ను స్థాపించారు. మతం, కులం, వర్గం, ఆడ మగా తేడాలకు అతీతంగా మనుషులందరినీ సమానంగా గౌరవించాలని బోధించారు. బావులు తవ్వించి అన్ని కులాల వారికి నీరు తోడుకోవడానికి అనుమతించారు. జంతు బలులను వ్యతిరేకించారు. విగ్రహారాధనను నిరాకరించారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 19వ శతాబ్దంలో నిమ్న కులాల మహిళలు తమ ఛాతిని వస్త్రంతో కప్పుకోవడానికి జరిపిన ఉద్యమంలో ఆయన పాత్ర ఉన్నది.

పెద్ద కులాల సాంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నాడని ఫిర్యాదులు పెరగడంతో తిరువితంకూర్ మహారాజ స్వాతి తిరునాల్ ఆయనను 110 రోజులు తిరువనంతపురంలో నిర్బంధించారు. దేశాన్ని పాలిస్తున్న ఇంగ్లీషువారు తెల్ల దెయ్యాలు అయితే.. తిరువితంకూర్ మహారాజ నల్ల దేవుడు అని నిరసించారు. అన్ని కులాల్లోని తప్పుడు ఆచారాలను వ్యతిరేకించారు. మరో సంఘ సంస్కర్త నారాయణ గురు, చట్టాంబి స్వామిల గురువు థాయ్‌కాడ్ అయ్యగారు.. ఈయన అనుచరుడే.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...