Jul 1, 2022, 12:52 PM IST
స్వాతంత్ర ఉద్యమంలో దేశ ఆత్మగౌరవాన్ని, జాతీయతా జాగృతిని ప్రేరేపించిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ పీసీ రే కూడా ఒకరు. పాశ్చాత్యుల ప్రకారం భారతదేశం చాలా కాలం పాటు మూఢనమ్మకాలకు, సనాతనవాదాలకు కేంద్రంగా ఉంది. అయితే వీటిని తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో సర్ పీసీ రే ఎంతో ప్రయత్నించారు. ఆయన అసలు పేరు ఆచార్య ప్రపుల్ల చంద్ర రే. ఆయనను భారతీయ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారు
జె.సి.బోస్ (జగదీష్ చంద్రబోస్) పాశ్చాత్యులు బలవంతంగా గుర్తించాల్సి వచ్చిన శాస్త్రవేత్త సర్ పీసీ రే. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అత్యున్నత బహుమతిని గెలుచుకున్న మొట్టమొదటి నాన్-యూరోపియన్ కూడా ఆయనే. రే ఒక విద్యావేత్త, చరిత్రకారుడు, వ్యాపార పారిశ్రామికవేత్త, పరోపకారి. అన్నిటికీ మించి ఆయన తీవ్రమైన జాతీయవాది. అలాగే బెంగాల్ విప్లవకారులకు మద్దతుదారుడు కూడా.. ఆయన ఒక విప్లవకారుడిగా, శాస్త్రవేత్తగా కూడా గుర్తించబడ్డాడు. సర్ పీసీ రే గాంధీజీకి సన్నిహితుడు గా ఉన్నారు. భారత్ లో మొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీని ఆయనే స్థాపించారు. 1892లో రూ.700 పెట్టుబడితో ప్రారంభమైన బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ తో ప్రభుత్వ రంగ దిగ్గజంగా అవతరించింది. రే హిస్టరీ ఆఫ్ ది హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
రే ప్రస్తుత బంగ్లాదేశ్ లోని తూర్పు బెంగాల్ లోని జెస్సోర్ లో ఓ జమీందారు కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులు. అలాగే బెంగాలీ పునరుజ్జీవనోద్యమ సూత్రదారి అయిన బ్రహ్మోసమాజ్ అనుచరులు. ఆ దంపతులు తమ కుమారులను మాత్రమే కాకుండా కుమార్తెలను కూడా ఇంగ్లీష్ విద్యను నేర్చుకునేందుకు పంపించారు. కేశబ్ చంద్ర సేన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి రెనాయిస్ నాయకులు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ప్రఫుల్ల చదువుకున్నారు. ఆయన గురువులలో ప్రముఖుడు సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఉన్నారు.
కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో సర్ అలెగ్జాండర్ పెడ్లర్ ఆధ్వర్యంలో రసాయన శాస్త్రం, ప్రయోగాల ప్రపంచానికి ప్రఫుల్లా నాయకత్వం వహించాడు. డిగ్రీ పూర్తికాక ముందే ప్రఫుల్లా యూకేలోని ఎడిన్ బర్గ్ యుటీలో చదువుకోవడానికి స్కాలర్ షిప్ పొందాడు. ప్రఫుల్లా తన 21వ యేట 1882లో లండన్ బయలుదేరారు. కెంబ్రిడ్జిలో విద్యార్థిగా ఉన్న సమయంలో జేసీ బోస్ కు మిత్రుడు అయ్యారు. రే తన బాల్యం నుంచే జాతీయవాదం, దేశ స్వాతంత్రం పట్ల మక్కువ చూపేవాడు. ఆయన లండన్ లో ఉన్నప్పుడు జాతీయవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు.
అయితే ఆయన తిరిగి భారత్ కు వచ్చే సమయానికి బ్రిటిష్ వారి వాచ్ లిస్ట్ లో ఉండటం వల్ల రే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ లో ప్రవేశానికి నిరాకరణకు గురయ్యాడు. ప్రెసిడెన్సీ కళాశాలలో చాలా తక్కువ జీతంతో టీచర్ గా పని చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో సర్ పీసీ రే, జేసీ బోస్ తో కలిసి నివసించేవారు. పెరుగుతున్న జాతీయోద్యమంతో వారిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. ఖాదీ వస్త్రాల భౌతిక నాణ్యతపై తన అభిప్రాయంతో పాటు సైన్స్ సమస్యలపై గాంధీ ఆయనతో సంప్రదింపులు జరిపేవారు. గాంధేయవాద అహింసా మార్గాన్ని అనుసరించని బెంగాలీ విప్లవకారులకు మద్దతు ఇవ్వడానికి రే వెనుకాడలేదు.
తరువాత కలకత్తాలో కొత్తగా ప్రారంభించిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ అయ్యారు. ఆ సమయంలోనే ఆంగ్లేయులు రే సహకారాన్ని గుర్తించవలసి వచ్చింది. 1912లో డర్హామ్ కళాశాల ఆయనకు గౌరవ పట్టాను ప్రదానం చేయగా.. 1919లో నైట్ హుడ్ ను అందజేసింది. సర్ పీసీ రే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. తన సంపదలో ఎక్కువ భాగాన్ని జాతీయవాద, శాస్త్రీయ, మానవతావాద వెంచర్లతో కేటాయించారు. ఆయన 1944 తుది శ్వాస విడిచారు.