స్వతంత్ర సంగ్రామంలో అధిక సంఖ్యలో పాల్గొన్న బహుజనులు...

స్వతంత్ర సంగ్రామంలో అధిక సంఖ్యలో పాల్గొన్న బహుజనులు...

Published : Jul 21, 2022, 04:02 PM ISTUpdated : Jul 21, 2022, 04:04 PM IST

1857 మొదటి భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది భార‌తీయ రాజులు, రాణిలు, నవాబులు, బేగంల పోరాటాల‌ గురించి అందరికీ తెలుసు కానీ.. ఇటీవ‌లి కాలంలో జ‌రిపిన కొన్ని అధ్య‌య‌నాలు వెనుకబడిన కులాల సమూహాలు, అనేక మంది వీర‌వ‌నిత‌లు సైతం ఆ తిరుగుబాటులో పాలుంప‌చుకున్నార‌ని వెల్ల‌డించాయి.

1857 మొదటి భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది భార‌తీయ రాజులు, రాణిలు, నవాబులు, బేగంల పోరాటాల‌ గురించి అందరికీ తెలుసు కానీ.. ఇటీవ‌లి కాలంలో జ‌రిపిన కొన్ని అధ్య‌య‌నాలు వెనుకబడిన కులాల సమూహాలు, అనేక మంది వీర‌వ‌నిత‌లు సైతం ఆ తిరుగుబాటులో పాలుంప‌చుకున్నార‌ని వెల్ల‌డించాయి. ఇన్నాళ్లూ వారు జాన‌ప‌ద కథలు-ఇతిహాసాలలో వారి పోరాటాలు క‌నిపించాయి. ఇలాంటి కోవ‌కు చెందిన బహుజన వీర‌వ‌నితల్లో రాణి అవంతీ బాయి, మహాబిరి దేవి, ఝల్కారీ దేవి, ఉదా దేవి, ఆశాదేవిలు ఉన్నారు. అవంతీ బాయి.. రామ్ గర్ఘ్ లోధి రాజపుత్ రాణి. మహాబిరి అత్యల్ప వ‌ర్గానికి చెందిన‌ భంగిస్ కులానికి చెందిన‌ది. ఝల్కారి దేవీ కోరి కులానికి చెందినవారు. ఉదా దేవి ఒక పాసి. ఆశాదేవి ఒక గుర్జారీ.. ఇలా అందరూ కుల సోపానక్రమంలో తక్కువ వ‌ర్గాల‌కు చెందిన‌వారు. 

నేటి మధ్యప్రదేశ్‌లోని రామ్‌ఘర్‌కు చెందిన రాజా విక్రమాదిత్య లోధి భార్య అవంతి బాయి. రాజ్యంలో పరిపాలనాపరమైన, సైనిక వ్యవహారాలలో ఆమె ప్రవీణురాలు. 1857లో తిరుగుబాటు జరిగినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు చెల్లించవద్దని అవంతి తన ప్రజలను కోరింది. బ్రిటీష్ అణచివేత స‌మ‌యంలో అవంతి 4000 మంది సైన్యాన్ని బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా ముందుకు నడిపించింది. కంపెనీ అవుట్‌పోస్టులపై దాడి చేసి అనేక మందిని చంపింది. బ్రిటీష్ సేన‌లు చుట్టుముట్టిన స‌మ‌యంలో త‌న కత్తితో ప్రానాలు తీసుకుంది. 

మహాబిరి ఉత్తరప్రదేశ్‌లోని ముసఫర్‌నగర్‌లో భంగి కులంలో జన్మించారు. ఆమె చిన్నతనం నుంచే తెలివైన- ధైర్యం సాహ‌సాల‌ను ప్రదర్శించింది. యువతిగా, కుల- లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లలను రక్షించడానికి మహాబిరి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. మహాబిరి దాని సభ్యులకు ఆయుధాలు, గుర్రపు స్వారీలో శిక్షణ ఇచ్చారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైనప్పుడు, బహుజన మహిళల మహాబిరి సైన్యం బ్రిటిష్ శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ క్ర‌మంలోనే బ్రిటిష్ సైన్యం ఆమెను పట్టుకుని కాల్చి చంపింది.

ఝల్కారీ దేవి భర్త ఝాన్సీ రాణి లక్ష్మీబాయి సైన్యంలో ఒక సైనికుడు. గుర్రాలను స్వారీ చేయడం, కుస్తీ పట్టడం, కాల్పులు జ‌ర‌ప‌డం వంటివి త‌న భ‌ర్త నుంచి నేర్చుకుంది. రాణి దుర్గా దళ్ అనే మహిళా సైన్యాన్ని నిర్వహించడానికి ఝల్కారీని నియమించింది. ఝాన్సీ కోటను ముట్టడించినప్పుడు, ఝల్కారీ రాణి తప్పించుకోవడానికి సహాయం చేసింది. బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా పోరాటం సాగించింది. 

ఉదా దేవి పాసి కమ్యూనిటీకి చెందినది.  1857 నాటి ప్రముఖ నాయకులలో ఒకరైన ఔద్ రాణి బేగం హజ్రత్ మహల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. బేగం కోసం మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేయడంలో ఉదా ముందంజలో ఉన్నారు. ఈస్టిండియా కంపెనీ సైన్యం సికందర్ బాగ్‌పై దాడి చేసినప్పుడు, ఉదా దేవి బేగంతో కలిసి పోరాడింది.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...