వలసవాదులపై తిరగబడ్డ తొలి భారతీయ రాణి - రాణి అబ్బక్క చౌట

వలసవాదులపై తిరగబడ్డ తొలి భారతీయ రాణి - రాణి అబ్బక్క చౌట

Published : Jul 23, 2022, 12:31 PM ISTUpdated : Aug 07, 2022, 08:43 AM IST

భారతదేశం బ్రిటీష్ వారి చేతులోకి మాత్రమే ఒక్క సారిగా వెళ్లిపోలేదు.

భారతదేశం బ్రిటీష్ వారి చేతులోకి మాత్రమే ఒక్క సారిగా వెళ్లిపోలేదు. వారి కంటే ముందు మ‌న దేశానికి అనేక దేశ‌స్తులు వ‌చ్చి నెమ్మ‌దిగా ఇక్క‌డ అక్ర‌మ‌ణ చేయ‌డం ప్రారంభించారు. అందులో పోర్చుగీసు వారు కూడా ఉన్నారు. అయితే వారితో మొద‌టిగా పోరాడిన మ‌హిళ‌గా రాణి అబ్బక్క చౌతాగా చెప్పవ‌చ్చు. 16వ శతాబ్దం ప్రారంభంలోనే పోర్చుగీస్‌తో పోరాడారు. ఆమె కర్ణాటక రాష్ట్రంలోని నేటి దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరు కు చెందిన మ‌హిళ‌. ఉత్తరాన గంగావళి,  దక్షిణాన చంద్రగిరి నదుల మధ్య ఉన్న ఉల్లాల్ సుగంధ సంపన్న రాజ్యానికి అబ్బక్క చౌతా ఆమె రాణి. పోర్చుగీసువారు కోజికోడ్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించి దోచుకోవ‌డం ప్రారంభించిన కొన్ని సంవ‌త్స‌రాల‌కు ఆమె వారికి మ‌ర్చిపోలేని పాఠం నేర్పారు. ఆమె కోజికోడ్‌కు చెందిన సమూతిరితో క‌లిసి పోరాడారు. అబ్బక్కను ధైర్య స్త్రీత్వానికి తొలి చిహ్నంగా చూడొచ్చు. ఎందుకంటే ఆమె పోర్చుగీసు వారితో చేతులు కలిపిన తన మాజీ భర్తతో కూడా పోరాడింది. అబ్బక్క ఉల్లాల్ జైన రాజు తిరుమలరాయుని మేనకోడలు. మాతృస్వామ్య వ్యవస్థను అనుసరించి ఆమె రాణి అయ్యారు. బాల్యం నుంచే అనే యుద్ధ విద్యలలో  శిక్షణ పొందింది. ఆమె పొరుగు రాజ్యమైన బంగా రాజు లక్ష్మణప్ప అరసు బంగార్రాజు IIని వివాహం చేసుకుంది.అనేక రాజ్యాల‌ను స్వాధీనం చేసుకున్న పోర్చుగీసు వారి క‌న్ను ఉల్లాల్ రాజ్యంపై ప‌డింది. అయితే దీనిని ధీటుగా ఎదుర్కొంటాన‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఆమెకు హిందూ-ముస్లిం సైన్యం నుండి ఊహించని విధంగా ప్రతిఘటన ఎద‌రైంది. దీంతో ఆమె బిద్నూర్ రాజు సమూతిరి, బీజాపూర్ సుల్తాన్‌లతో  క‌లిసి ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు వ్య‌తిరేకంగా ఒక ఉమ్మ‌డి ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి పోరాడింది. 1555లో అడ్మిరల్ అల్వెరో డి సిల్వెరో, తరువాత జోవో పిక్స్టో నేతృత్వంలో ఉల్లాల్‌పై చేసిన దాడిని అబ్బక్క విజయవంతంగా అడ్డుకుంది.కానీ వైస్రాయ్ ఆంథోనీ నొరోనా నేతృత్వంలో బ‌ల‌మైన సైన్యం ఉండ‌టంతో కొంత వెన‌క్కి త‌గ్గింది. వారి నుంచి తప్పించుకుని అబ్బ‌క్క సమీపంలోని మసీదులో ఆశ్రయం పొందింది. కానీ ఆమె రాత్రి సమయంలో పోర్చుగీస్ కంటోన్మెంట్‌పై మెరుపు దాడిని చేసింది. అయితే 1575లో అబ్బక్క తన మలయాళీ కమాండర్ పోకర్ మరక్కర్‌ను పోర్చుగీసు వారి చంప‌డంతో తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అబ్బ‌క్క‌ను పోలీసులు బంధించి జైలులో వేశారు. అక్క‌డ కూడా ఆమె ధైర్యంగా ప్ర‌తిఘ‌టించి చివ‌రికీ వీర మ‌ర‌ణాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో అబ్బక్కను అభయ రాణిగా, భయం తెలియని రాణిగా గౌరవిస్తారు

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...