అదంతా ఎల్లో మీడియా రాజకీయం.. జగన్ కారు దిగడానికి కారణం అదే.. విజయసాయిరెడ్డి

May 12, 2020, 5:20 PM IST

విశాఖ గ్యాస్ లీక్ గ్రామాల్లో సోమవారం రాత్రి బస చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇవ్వడం కోసమే తాము రాత్రి అక్కడ బస చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన సమయంలో తనను సీఎం జగన్ కారు నుంచి దించేశారన్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొట్టిపడేశారు. ఆ రోజు హెలికాప్టర్‌లో చోటు లేనందువల్లే తాను వెళ్లే కంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెళ్లడమే ముఖ్యమని తాను దిగిపోయానని స్పష్టం చేశారు. దీన్ని ఎల్లో మీడియా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.