
అమరావతి భూసేకరణపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 54 వేల ఎకరాల్లో అభివృద్ధి జరిగిపోయిందని చెబుతూ, ఇంకా మరో 44 వేల ఎకరాల సేకరణకు సిద్ధమవుతున్నారని ఆమె మండిపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, లూటీ నడుస్తోందన్న షర్మిల.. తొలిదశలో సేకరించిన 54 వేల ఎకరాలపై శ్వేతపత్రంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.