
ఆర్టీసీ విలీనంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మనము విలీనం చేయకపోతే చంద్రబాబు నాయుడు ఆర్టీసీని ప్రైవేట్ చేతులకు అప్పగించేవారు” అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఆర్టీసీ విలీన నిర్ణయం తీసుకుందని, ఉద్యోగుల భవిష్యత్తు, సంక్షేమం కోసం ఈ చర్య అవసరమైందని వైయస్ జగన్ స్పష్టం చేశారు.