విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో క్రిస్మస్ ఈవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలు దీపాల అలంకరణతో వెలుగులీనాయి. భక్తులు ప్రార్థనల్లో పాల్గొని క్రీస్తు జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మువ్వల ప్రసాద్ (మోన్సిగ్నర్ ఫాదర్) శాంతి, ప్రేమ, సోదరభావం ప్రాధాన్యతను వివరిస్తూ సందేశం ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు.