సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మట్టి, నీరు కలుషితమవుతున్నాయని, చివరికి మనం తినే ఆహారం ద్వారా అది మన శరీరంలోకి చేరుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డాక్టర్ రత్నా పెమ్మసాని హెచ్చరించారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం భావితరాల భవిష్యత్తును కాపాడుతుందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ఈ నూతన సంవత్సరం వేళ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా వదిలేయాలని, ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణ సంకల్పంలో భాగస్వాములవ్వాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.