vuukle one pixel image

నోట్లో నోరు పెట్టి ముద్దులు, కౌగిలింతలతో జగన్ విన్యాసాలు..: అయ్యన్న ఎద్దేవా

Chaitanya Kiran  | Published: Dec 28, 2022, 3:20 PM IST

అనకాపల్లి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రవ్యాఖ్యలు చేసారు. ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో వుండగా 2019లో  నర్సీపట్నం వచ్చి హామీలు గుప్పించాడని... అవేవీ నెరవేర్చకుండానే సీఎం హోదాలో మళ్ళీ వస్తున్నారని అన్నారు. ఆనాడు బహిరంగ సభలో పుడింగిలాగా ఎవరయినా రాజకీయ నాయకుడు హామీ ఇచ్చి నెరవేర్చకపోతే రాజీనామా ఇచ్చి ఇంటికి పోవాలని... అవినీతి రహిత పాలన జగన్ ఒక్కడే ఇవ్వగలడని అన్నాడని అయ్యన్న గుర్తుచేసారు. ఇలా మాయమాటలు చెప్పి, ఎవరెవరో నోట్లో నోరు పెట్టి ముద్దులిచ్చి, కౌగిలింతలతో రకరకాల విన్యాసాలు చేసి జగన్ గెలిచాడని అయ్యన్న అన్నాడు.  ముఖ్యమంత్రి హోదాలో నర్సీపట్నం వస్తున్న జగన్ ను కలవడకుండా అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించడాన్ని అయ్యన్నపాత్రుడు తప్పుబట్టాడు. సుందరాంగమైన ముఖం ఎవ్వరూ చూడవద్దన్నట్లుగా రోడ్డంతా పరదాలు కడుతున్నారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేసారు.