vuukle one pixel image

అసెంబ్లీలో టిడిపి, వైసిపి ఓవరాక్షన్... పక్కున నవ్వుకున్న మహిళా ఎమ్మెల్యేలు

Chaitanya Kiran  | Published: Sep 21, 2023, 11:11 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష టిడిపి, అధికార వైసిపి సభ్యుల మధ్య మాటలయుద్దం సాగింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి సభ్యులు సభ ప్రారంభమవగానే ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని గందరగోళం సృష్టిస్తున్న టిడిపి సభ్యులపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ఓ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటికి మధ్య మీసాలు తిప్పడం, తొడలు కొట్టడంపై సవాళ్లు ప్రతిసవాళ్లు జరిగాయి. ఇలా ఇరుపార్టీలు అసెంబ్లీలో ఓవరాక్షన్ చేయడంచూసి మహిళా శాసనసభ్యులు పక్కున నవ్వుకున్నారు.