
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి నిత్యం జగన్ నామాన్ని జపిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రామకోటి మాదిరిగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నిత్యం జగన్ కోటి రాస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు పాలన మొత్తం హడావిడితో కూడిన పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.