KIMS ఆసుపత్రిలో బాత్రూంలు కడిగే వ్యక్తితో ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 KIMS ఆసుపత్రుల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడని KIMS సంస్థ నుంచి ఆ డాక్టర్ ఉన్నాడని లేఖ విడుదల చేస్తే, తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెబుతానని సవాల్ విసిరారు.