తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై, తాను ఐదేళ్లుగా చేసిన పాలనపై రాయలసీమలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. అనంతపురంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పౌరుషాల పేరుతో తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం మానేసి రాజకీయంగానో లేదా అభివృద్ధి పరంగానో ఎదుర్కోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు.