పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకుని శ్రీ స్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకున్నారు. కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనందసాయితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.