మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజల విశ్వాసాలను గాయపరుస్తోందని అన్నారు. దేవాలయాలు, సంప్రదాయాలు, ఆచారాలపై గౌరవం లేకుండా రాజకీయ లాభాల కోసం వ్యవహరించడం తగదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించే ప్రభుత్వం మాత్రమే ప్రజల మద్దతు పొందుతుందని ఆయన తెలిపారు.