
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకుని, రంపచోడవరంలో ఆదివాసీల కొమ్ము నృత్యంతో ఘన స్వాగతం అందుకున్నారు. యూత్ సెంటర్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ & జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.