
విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో హాజరైన వెంకయ్య నాయుడు, కళాకారుల ప్రదర్శనలు తిలకిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. గ్రామీణ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వేడుకల్లో విశేష సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.