Galam Venkata Rao | Published: Apr 12, 2025, 2:00 PM IST
హిందూ ధర్మాన్ని కాలరాయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పుడు నోరుమెదపని వారంతా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.