Aug 5, 2020, 11:07 AM IST
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సమీక్ష నిర్వహించారు. 'సంగం' మండలంలోని సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. స్థలాల గుర్తింపు, లబ్దిదారులు, దరఖాస్తుదారుల వివరాలపై మంత్రి ఆరా తీశారు. రెండవ దశలో లబ్దిదారుల గుర్తింపు, స్థలం సేకరణ, ఆన్ లైన్ వివరాల నమోదు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు