Jan 14, 2025, 8:01 PM IST
తెలుగు సినీ నటుడు, మంచు మోహన్ బాబు తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. 120 మంది అనాథల దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. తిరుపతి బైరాగిపట్టెడ మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్న ఆయన.. వారి చదువుతో పాటు అన్ని బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఆ పిల్లలకు కుటుంబ సభ్యుడిలా తోడుంటానని చెప్పారు మంచు విష్ణు.