Jan 17, 2023, 6:16 PM IST
రాజమండ్రి : వేగంగా దూసుకుపోయే రైలట... అత్యాధునికి సదుపాయాలతో కూడిన రైలట... ఇలా వందే భారత్ ఎక్స్ ప్రెస్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే దాన్ని చూడాలని అతడు రాజమండ్రి రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. బయటి నుండి దగదగా మెరిసిపోతున్న వందే భారత్ ను చూసి మంత్రముగ్దుడై అతడు ఆగలేక రైలెక్కి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించాడు. అయితే ఇంతలోనే రైలు తలుపులు ఆటోమెటిగ్గా మూసుకుపోవడంతో అతడు అందులోనే చిక్కుకున్నాడు. ఇలా ఒక్క సెల్పీ కోసం రైలెక్కి రాజమండ్రి నుండి విజయవాడకు ప్రయాణించాల్సి రావడమే కాదు టికెట్ లేకుండా రెలైక్కి ఫైన్ కట్టాల్సి రావడంతో జేబులు ఖాళీ చేసుకున్నాడు. ఇలా ఓ వ్యక్తి సెల్పీ కోసం ఎరక్కపోయి వందే భారత్ రైలెక్కి ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.