గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రూ.58 కోట్ల పైచిలుకు నిధులతో నగరంలో మూడు వంతెనలు నిర్మించినట్లు చెప్పారు. నగరం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.