గురజాలలో తెలుగుదేశం నాయకులు మధ్య ఫ్లెక్సీల వివాదం

Dec 31, 2022, 1:39 PM IST

గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు మధ్య ఫ్లెక్సీల వివాదం నెలకొంది. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో  డాక్టర్ . చల్లగుండ్ల. శ్రీనివాస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ఇధి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని వర్గీయుల పనేనని చల్లగుండ్ల శ్రీనివాస్ వర్గీయులు ఆరోపణ చేస్తున్నారు. దీనిమీద  డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా..ఆ పార్టీ నాకు తల్లితో సమానం.. అందుకే ఫ్లెక్సీల తొలగింపు పై ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వడం లేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. అన్నారు.