Dec 11, 2019, 10:24 AM IST
పెంచిన ఆర్టీసీ ధరలకు నిరసనగా టీడీపీ నేత నారాలోకేష్ మంగళగిరి నుండి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు. సచివాలయం వద్ద బస్సు దిగి అసెంబ్లీ కి పాదయాత్ర గా వస్తుండగా లోకేష్ సమీపంలో పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది. లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలను తగిలి కింద పడింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు, నారాలోకేష్, ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.