రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం పెడన నియోజకవర్గంలో పర్యటించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ చందు వీరవెంకట వసంత రాయలు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి నివాళులు అర్పించారు. మృతుడి భార్య శ్రీమతి నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవికి ఓదార్పు తెలిపారు.