శ్రీశైలం డ్యాంలో దుప్పి.. పై నుండి కొట్టుకువచ్చి..

శ్రీశైలం డ్యాంలో దుప్పి.. పై నుండి కొట్టుకువచ్చి..

Bukka Sumabala   | Asianet News
Published : Jun 15, 2020, 10:30 AM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వెనుక భాగాన దుప్పి మృతదేహం దొరికింది. 

కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వెనుక భాగాన దుప్పి మృతదేహం దొరికింది. ఇది ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకువచ్చినట్టుగా భావిస్తున్న దుప్పి కుళ్ళిన స్థితిలో ఉంది. చనిపోయి చాలా రోజులై ఉంటుందని అనుమానిస్తున్నారు. అడవి ప్రాంతం నుంచి నీటిని తాగేందుకు నది వద్దకు చేరి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందిందా.. లేకా ఎవరైనా వేటగాడు కొట్టడం వల్ల తప్పించుకునే క్రమంలో నీటిలో పడి మరణించిందా అని  అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.