మండపేట నియోజకవర్గం, రాయవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాయవరంలో కంటిపూడి సత్యసాయిబాబా అనే రైతుకు పట్టాదారుపాసుపుస్తకాన్ని సీఎం అందించారు. అనంతరం పాసుపుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను సెల్ ఫోన్‌లో స్కాన్ చేయించి మ్యాప్ ద్వారా పొలం వద్దకు రైతు, అధికారులతో పాటు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో తమకు పట్టాదారు పుస్తకం ఇవ్వడం సంతోషంగా ఉందని రైతు సత్యసాయిబాబా సీఎంతో అన్నారు.