CM Chandrababu pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పైచంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu

Published : Jan 07, 2026, 05:15 PM IST

పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్‌తో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేయాలని, కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం వెల్లడించారు.