vuukle one pixel image

బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 14, 2025, 8:04 PM IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదికలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఓ బడ్డీకొట్టు దగ్గర ఆగారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఉపాధి కల్పించి సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.