ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడంపై పోలీస్ స్టేషన్లో నిరసన

ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడంపై పోలీస్ స్టేషన్లో నిరసన

Published : Feb 22, 2022, 11:35 AM IST

ఆశ వర్కర్ల రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి బయలుదేరిన నూజివీడు నియోజకవర్గంలోని ఆశ వర్కర్ లను నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి, నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లలో ముందస్తు అరెస్టులు చేశారు.

ఆశ వర్కర్ల రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి బయలుదేరిన నూజివీడు నియోజకవర్గంలోని ఆశ వర్కర్ లను నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి, నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లలో ముందస్తు అరెస్టులు చేశారు.ఈ సందర్భంగా ఆశావర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్ లను రాష్ట్రప్రభుత్వం ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించినప్పటికీ కరోనా  విపత్కర పరిస్థితుల్లో మృతి చెందిన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని, కనీసం వ్యాక్సిన్లు వేసే క్రమంలో మాస్కులు, చేతికి గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు కూడా ఏమి అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లకు కనీసం ఆపద సమయంలో సైతం సెలవులు కూడా పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఆశ వర్కర్లు బందిపోట్లు, తీవ్రవాదులు కాదని కేవలం తమ డిమాండ్ల సాధన కోసం మాత్రమే జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్దకు బయలుదేరి వెళ్తున్న తమను అరెస్టులు చేయడం దారుణమని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తాము సేవలు అందించామని, తమకు కనీస సౌకర్యాల కల్పన చేయడంలో, బీమా సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం తాత్సారం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏది చెప్తే అది చేసుకుని పోతున్న ఆశావర్కర్లను కనీసం మనుషుల్లాగా గుర్తించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. పనిభారం వలన కొందరు ఆశావర్కర్లు అకాల మరణం చెందారని, మృతి చెందిన వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఆశావర్కర్లు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం వల్ల ఏ గతి పొందిందో ప్రభుత్వాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అదే ధోరణి ప్రదర్శిస్తుందని, ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు కనీసం సెలవులు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ సభ్యులు మృతిచెందినప్పటికీ సెలవు కూడా ఇవ్వని పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ఈ సందర్భంగా ఆశావర్కర్లు స్పష్టం చేశారు.

18:18Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
07:37పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu
05:49Nara Lokesh Powerful Speech in Assembly: అసెంబ్లీ లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
03:18Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu
54:43CM Chandrababu Powerful Speech: అసెంబ్లీ లో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
26:14Dputy CM Pawankalyan Speech in Assembly: పవన్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ | Asianet News Telugu
12:05Kalvakuntla Kavitha in Tirumala: కొత్త పార్టీ పడతా: కవిత | Asianet News Telugu
19:56ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి బంపరాఫర్ | CM Chandrababu on AP Population | Asianet News Telugu
04:24ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu
03:30Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్ల‌తో కొత్త స‌బ్ స్టేష‌న్లలు | Asianet News Telugu