Apr 13, 2023, 5:00 PM IST
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఏపీలో పాలన, వైసిపి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య అగ్గిని రాజేసాయి. ఇప్పటికే ఏపీలో బిఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ జరక్కుండా అడ్డుకుంటామంటూ బిఆర్ఎస్ నాయకుల ప్రకటనలు వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో పాలనపై హరీష్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. తాజాగా హరీష్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు మాటలు వింటే మామ కేసీఆర్ తో కలిసి ఫాం హౌస్‌లో కూర్చుని కల్లుతాగినట్లు అనిపించిందని అప్పలరాజు అన్నారు. కల్లుతాగిన కోతిలా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ నీ మామలాగ ఫాం హౌస్ లో కూర్చుని కల్లు తాగడం లేదు... లేకపోతే ఆయన కూతురు కవిత లాగ లిక్కర్ స్కాంలు చేయడంలేదంటూ అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు.