Sep 6, 2020, 7:19 PM IST
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని రథం గత రాత్రి అగ్నికి ఆహుతైయిన విషయం తెలిసిన వెంటనే దేవదాయ శాఖ మంత్రి దేవదాయ కమిషనర్ పి.అర్జునరావుకు, జిల్లా ఎస్సితో ఫోన్ మాట్లాడారు. సహయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ ఘటనపై విచారణ అధికారిగా దేవదాయ శాఖ అదనపు కమిషనర్ కమిషనర్ రామచంద్రమోహన్ నియమించారు..ఇది దుండగుల చర్యగా తేలితే కఠిన చర్యలు చేపట్టాలని, దేవదాయ శాఖ అధికారులతో పాటు పోలీసులు సంబంధిత అధికారులతో విచారణ చేపట్టాలని అధికారులను అదేశించారు.