కాకినాడ కెనాల్ రోడ్డులో శనివారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సామర్లకోట నుంచి కాకినాడ వైపు వస్తున్న ఓ లారీ సాంకేతిక లోపంతో రైల్వే గేటు వద్ద రోడ్డుమధ్య నిలిచిపోవడంతో సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా, తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి అందరి మనసులు గెలుచుకున్నారు. ఆమె సేవాభావాన్ని గుర్తించిన హోం మంత్రి అనిత ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.