
సంక్రాంతి సంబరాల్లో భాగంగా అంబటి రాంబాబు అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణే” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంబటి రాంబాబు డ్యాన్స్, వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.