సీఎం జగన్ నివాసం వద్ద ప్లెక్సీల కలకలం

సీఎం జగన్ నివాసం వద్ద ప్లెక్సీల కలకలం

Naresh Kumar   | Asianet News
Published : Jul 18, 2021, 04:59 PM IST

గుంటూరు; తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వెనకాల గల  కరకట్ట పై నిర్వాసితుల పేరిట ఏర్పాటయిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

గుంటూరు; తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వెనకాల గల  కరకట్ట పై నిర్వాసితుల పేరిట ఏర్పాటయిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అమరారెడ్డి నగర్ కాలనీ నిర్వాసితులు ఫ్లెక్సీ రూపంలో నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసితలు ఆరోపించారు. నిజమైన  నిర్వాసితులకు అన్యాయం జరిగిందని... కేవలం తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలం కేటాయించారని ఆరోపించారు.  

కొంత మంది స్వార్థపరులు వల్ల వైసిపి పార్టీకి, అమరారెడ్డినగర్ నిర్వాసిత బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. రెండు చర్చిలను నేలకూలుస్తున్నారని... కనీసం చర్చిలకైనా స్థలం కేటాయించాలని పాస్టర్లు కోరారు. నిర్వాసితులమైన తమకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, నాయకులకు ఫ్లెక్సీ రూపంలో విన్నవించుకున్నారు.