
మయన్మార్‌లో సైబర్ బానిసత్వానికి గురైన 22 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చారు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 120 మందికి పైగా బాధితులను తిరిగి స్వదేశానికి రప్పించారు. ఈ రక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఐడీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో నిర్వహించింది. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా, బాధితుడు శ్రీనివాస్ ఈ అక్రమ రవాణా, మోసాలపై కీలక వివరాలను వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.