Book Train Tickets: మీకు ట్రైన్ టికెట్ బుక్ చేయడం తెలియదా? ఈ విషయాలు తెలిస్తే ఇంత ఈజీనా అంటారు

Book Train Tickets: ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. IRCTC లాంటి యాప్స్, వెబ్ సైట్లలో బుక్ చేసినా కన్ఫర్మ్ అవుతాయన్న గ్యారెంటీ ఉండదు. రిస్క్ ఎందుకని చాలా మంది ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకుంటారు. డబ్బులు కూడా ఎక్కువ చెల్లిస్తుంటారు. ఇక్కడ రైలు టికెట్లు బుక్ చేసుకునే విధానాలను పూర్తి వివరాలతో అందిస్తున్నాం. అంతేకాకుండా బుకింగ్ పద్ధతులు, బోగీల రకాలు, రైల్వే  నియమాలు, ప్రయాణాన్ని సులభతరం చేసే చిట్కాలు కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. 

How to Book Train Tickets Online and Offline - 2025 Guide in telugu sns

ఇండియన్ రైల్వే ఎంత పెద్ద రవాణా నెట్‌వర్క్‌ అంటే రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తూ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే సంస్థగా నిలిచింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా జరగాలంటే రైలు టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం చాలా మంచిది. ట్రైన్ టికెట్స్ ఈజీగా బుక్ చేయాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 

రైలు టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా?

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ & యాప్ - అధికారిక IRCTC పోర్టల్ (www.irctc.co.in), IRCTC రైల్ కనెక్ట్ యాప్ ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి.
  • రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు - ఆఫ్‌లైన్‌లో ట్రైన్ టికెట్ తీసుకోవాలనుకునే వాళ్లు రైల్వే స్టేషన్లలో తీసుకోవచ్చు.
  • గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్లు - ఇంకా సులువుగా ఉండాలంటే ప్రయాణికులు లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
  • ఇతర యాప్‌లు - పేటీఎం, గూగుల్ పే ఇంకా చాలా డిజిటల్ యాప్‌లు రైలు టికెట్ బుకింగ్‌ను సులభతరం చేస్తాయి.

How to Book Train Tickets Online and Offline - 2025 Guide in telugu sns

భారతీయ రైల్వే - రిజర్వ్ చేసిన బోగీల రకాలు

Latest Videos

భారతీయ రైల్వే వేర్వేరు అవసరాలకు, బడ్జెట్‌లకు తగినట్టుగా చాలా రకాల రిజర్వ్ చేసిన బోగీలను అందిస్తుంది.

  • ఫస్ట్ AC (1A) - ప్రైవేట్ క్యాబిన్‌లు ఉంటాయి. స్టార్ హోటల్ లో ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ పొందవచ్చు. 
  • సెకండ్ AC (2A) - సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. ప్రైవసీ కూడా ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ బోగీల్లో ప్రయాణం మీకు అలసట లేకుండా చేస్తుంది.
  • థర్డ్ AC (3A) - పడుకునే బెర్త్‌లతో బడ్జెట్‌కు తగిన AC బోగీలు ఉంటాయి. 1A, 2A కంటే టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయి.   
  • ఏసీ ఛైర్ కార్ (CC) - ఈ బోగీల్లో కూర్చుని ప్రయాణించాలి. బెర్త్ లు ఉండవు. ఏసీ ఉంటుంది కాబట్టి దగ్గర, దూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.
  • స్లీపర్ క్లాస్ (SL) - దూరం ప్రయాణించే వాళ్లకి ఏసీ లేని, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆప్షన్ స్లీపర్ క్లాస్. తక్కువ ధరలో అలసట లేని ప్రయాణం చేయొచ్చు.   
  • సెకండ్ సీటింగ్ (2S) - ఈ బోగీల్లో తక్కువ ధరలో సాధారణ సీటింగ్ ఉంటుంది. ఏసీ ఉండదు. బెర్త్ లు కూడా ఉండవు. ఎంత దూరమైనా కూర్చొనే ప్రయాణించాలి.  

రిజర్వేషన్ టికెట్లు - రూల్స్

అడ్వాన్స్ బుకింగ్ - ప్రయాణికులు తమ ప్రయాణానికి 60 రోజుల ముందు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్ బుకింగ్‌లు - చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వస్తే, బయలుదేరే ముందు రోజు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

ప్రీమియం తత్కాల్ - ఇవి కూడా తత్కాల్ టికెట్లే. కాని కాస్త ధర ఎక్కువ. అంటే ఈ తత్కాల్ టికెట్లు కచ్చితంగా బుక్ అవుతాయన్న మాట. 

సీనియర్ సిటిజన్ రాయితీలు - 60+ వయస్సు ఉన్న పురుషులు, 58+ వయస్సు ఉన్న మహిళలకు టికెట్ ధరల్లో ప్రత్యేక తగ్గింపులు ఇస్తారు.

డిజిటల్ టికెట్ సిస్టమ్ - ప్రయాణికులు ఈ-టికెట్లు, ఎం-టికెట్లను ఉపయోగించి ప్రయాణాలు చేయొచ్చు.

PNR స్టేటస్ ట్రాకింగ్ - టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ప్రయాణికులు ఎక్కే ముందు తమ PNR స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి.

ట్రైన్ జర్నీలో ఈ రూల్స్ పాటించాలి 

గుర్తింపు ధృవీకరణ - రైలు ప్రయాణం చేసుటప్పుడు కచ్చితంగా ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడీని వెంట తీసుకెళ్లాలి.

లగేజీ పరిమితి - ఎక్కువ ఛార్జీలు పడకుండా ఉండాలంటే, లిమిటెడ్ లగేజీలనే తీసుకెళ్లండి. 

సీటు, బోగీ కేటాయింపులు - ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సీట్లు, వాళ్ల ఛాయిస్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

రద్దు & డబ్బు వాపసు పాలసీ - బయలుదేరే ముందు టికెట్ రద్దు చేసిన సమయాన్ని బట్టి డబ్బు వాపసు వస్తుంది.

రైలు టికెట్ బుకింగ్ లోకి AI వచ్చేస్తోంది

భారతీయ రైల్వే తన డిజిటల్ టికెట్ విధానాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తోంది. దీనివల్ల రైల్వే స్టేషన్లలో పొడవైన క్యూలు తగ్గుతాయి. సీట్ల కేటాయింపునకు AIని ఉపయోగించాలని రైల్వే భావిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఉపయోగించి ఎప్పటికప్పుడు సీట్ల లభ్యతను చెక్ చేయడం వల్ల సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని పెంచడానికి కూడా పనిచేస్తోంది.

ఇది కూడా చదవండి రైలులో బెడ్‌షీట్ దొంగిలిస్తే శిక్ష ఏంటో తెలుసా?

vuukle one pixel image
click me!