రైలులో బెడ్‌షీట్ దొంగిలిస్తే శిక్ష ఏంటో తెలుసా?

Travel

రైలులో బెడ్‌షీట్ దొంగిలిస్తే శిక్ష ఏంటో తెలుసా?

ఏసీ బోగీలో సౌకర్యాలు

ఏసీ బోగీలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే చాలా సౌకర్యాలు ఇస్తుంది. ఇందులో బెడ్ రోల్ ఇస్తారు. అందులో రెండు బెడ్‌షీట్లు, ఒక దుప్పటి, దిండు, టవల్ ఉంటాయి.

బెడ్ రోల్ దొంగతనం చేస్తే..

రైలులో ప్రయాణించే వారిలో కొంతమంది ఏసీ బోగీలో దొరికే బెడ్‌షీట్, దుప్పటి లేదా దిండు తీసుకెళ్తూ దొరికిన సంఘటనలు తరచూ వెలుగుచూస్తుంటాయి.

రైల్వే సిబ్బందికి పనిష్మెంట్

ఏసీ బోగీ నుంచి బెడ్ రోల్ దొంగిలిస్తే రైల్వే సిబ్బంది జీతం నుంచి డబ్బులు కట్ చేస్తారు. ఎందుకంటే బెడ్ రోల్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. 

సిబ్బందికి సహకరించండి

రైలు ఏసీ బోగీలో ప్రయాణం అయిపోయాక, మీరు వాడిన బెడ్ రోల్‌ను తీసుకెళ్లొద్దు. సీటులో భద్రంగా పెట్టండి. దీనివల్ల ఉద్యోగులు దాన్ని జాగ్రత్త చేసుకుంటారు.

ఎన్ని బెడ్‌షీట్లు పోయాయి

2017-18 సంవత్సరం రిపోర్ట్ ప్రకారం, వెస్ట్ రైల్వే నుంచి 1.95 లక్షల టవళ్లు, 81,736 బెడ్‌షీట్లు, 5,038 దిండ్లు, 55,573 దిండు కవర్లు, 7,043 దుప్పట్లు దొంగతనం జరిగాయి.

మీకూ శిక్ష పడుతుంది?

రైల్వేకు సంబంధించిన బెడ్‌ రోల్ దొంగిలిస్తూ మీరు దొరికిపోతే రైల్వే పోలీసులు మీ మీద చర్యలు తీసుకుంటారు. ఒక్కోసారి ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా వేస్తారు.

ఎలా పట్టుకుంటారో తెలుసా?

రైల్వే బోగీల్లో ఉండే సీసీ కెమెరాల సహాయంతో బెడ్ రోల్ దొంగిలించిన వారిని పట్టుకుంటారు. వారికి రైల్వే ఆస్తి చట్టం1966, ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదా రూ.1,000 ఫైన్ వేస్తారు.

అందమైన ఈ 5 దేశాలు చూడాలంటే వీసా అవసరమే లేదు

Maha Shivaratri: ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహం ఎక్కడుందో తెలుసా?

Hill Stations: లైఫ్‌లో ఒకసారైనా చూడాల్సిన హిల్ స్టేషన్స్ ఇవే..

ప్రేమికులకు లక్కీ ఛాన్స్.. ఫ్లైట్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు