ఈ మధ్యకాలంలో దేశంలో మౌలిక సదుపాయాలు వేగంగా మెరుగవుతున్నాయి. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ఒకవైపు శరవేగంగా సిద్ధమవుతుంటే.. దేశంలో ట్రాన్స్‌పోర్ట్ స్పీడ్ పెంచేందుకు చెన్నైలో ఫస్ట్ హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను రెడీ అయ్యింది. ఈ ట్రాక్ పై గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది.
ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ స్పీడ్ పెంచేందుకు చెన్నైలో లాస్ట్ ఇయర్ రెడీ అయిన దేశంలోనే ఫస్ట్ హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను మంగళవారం ఓపెన్ చేశారు. ఈ ట్రాక్‌పై ట్రైన్ గంటకు 1200 కి.మీ స్పీడ్‌తో వెళ్లొచ్చు. ఇది సక్సెస్ అయితే, ఢిల్లీ-జైపూర్ నగరాల మధ్య 300 కి.మీ దూరాన్ని 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఐఐటీ మద్రాస్ సాయంతో రైల్వే డిపార్ట్‌మెంట్ 422 మీటర్ల పొడవైన హైపర్‌లూప్ (ట్రైన్ వెళ్లే టన్నెల్ లాంటి పైప్‌లోని రూట్) మార్గాన్ని డెవలప్ చేసింది. ఇది ట్రాఫిక్‌ను అధిగమించి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. దీని గురించి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ, ‘గవర్నమెంట్, ఐఐటీ కలిసి చేస్తున్న ఈ ఆపరేషన్ ఫ్యూచర్‌లో ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్‌లో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుంది’ అని చెప్పారు. ఏమిటీ హైపర్‌లూప్ ట్రాక్?: 5వ ట్రాన్స్‌పోర్ట్ మెథడ్ అని పిలిచే హైపర్‌లూప్ అనేది లాంగ్ జర్నీ కోసం ఒక హైస్పీడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. ఇది ట్రైన్స్‌ను ఖాళీ గొట్టాల్లో స్పెషల్ క్యాప్సూల్స్ ద్వారా చాలా స్పీడ్‌గా ట్రావెల్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో ఫ్లైట్ కంటే 2 రెట్లు వేగంగా వెళ్లొచ్చు. తక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడం, 24 గంటలు పనిచేసే కెపాసిటీ దీని సొంతం.