అందుకోసమే భువనేశ్వరి ఎంట్రీ... నాపై దాడి వారిపనే: వైసిపి ఎమ్మెల్యే రోజా

By Arun Kumar PFirst Published Jan 6, 2020, 6:33 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముసుగులో కొందరు  తన పర్యటనను అడ్డుకోడానికి ప్రయత్నించారని... వారంతా వైసిపి నుండి పక్కనబెట్టిన నాయకులని ఎమ్మెల్యే రోజా తెలిపారు.  

చిత్తూరు: కేవలం రాజకీయాల కోసమే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరిని పావులా వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఎక్కడ అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ తగ్గిపోతుందేమోనని చంద్రబాబు అమరావతి నుండి రాజధానిని తరలించడంపై రాద్దాంతం చేస్తున్నాడని... ఇప్పుడు తన భార్యను కూడా రంగంలోకి దింపాడని రోజా విమర్శించారు. 

సోమవారం రోజా మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు బినామీలు, హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే చంద్రబాబు  అమరావతిలో ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కేవలం చంద్రబాబు, లోకేశ్ మాత్రమే రైతుల కోసం పోరాడుతున్నట్లు నటించగా తాజాగా భువనేశ్వరి కూడా వీరి నాటకంలో భాగమయ్యారని అన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క శాశ్వత భవనం కట్టని చంద్రబాబు ఐదు నెలల జగన్‌ పాలనను విమర్శించడం హేయమన్నారు. 

తనపై ఆదివారం జరిగిన దాడిపై రోజా స్పందించారు. గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని పక్కనపెట్టామని... ఇప్పుడు వారే వైసీపీ ముసుగులో దాడికి యత్నించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని... అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు. దీంతో తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రోజా స్పష్టం చేశారు.

read more  ఏడు నెలల పాలన, జనం ముఖాల్లో చిరునవ్వు కరువు: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజాపై కొందరు వైసిపి నాయకులే దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై రోజా చాలా సీరియస్ గా ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైనే పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంపత్,  అంబు, సరళ, రామ్మూర్తి తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143, 341, 427, 506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పుత్తూరు పోలీసులు.

read more  మూడు రాజధానుల వల్ల లాభపడేది తెలంగాణే... అందువల్లే తలసాని...: బీద రవిచంద్ర

 పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును నిలిపిన వైసీపీ కార్యకర్తలు.. రోజా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినలేదు. అంతేకాకుండా పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.  
 

 
 

click me!