శ్రీవారి దర్శనభాగ్యం... వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల పేరెంట్స్ కి ప్రత్యేకం

By Arun Kumar P  |  First Published Oct 14, 2019, 6:29 PM IST

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వృద్దులు, వికలాంగులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తోంది.  


 శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

ఇందులోభాగంగా అక్టోబ‌రు 15న మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేయనున్నట్లు టిడిపి ప్రకటించింది.  వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి సూచించింది. 

Latest Videos

undefined

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను అక్టోబ‌రు 16న బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. 

సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి  సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

click me!