చిత్తూరు జిల్లాలోని ఓ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. యాదమర్రి మండలం మొద్దనపల్లిలో అమర్‌రాజా పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో ఈ చోరీ జరిగింది
చిత్తూరు జిల్లాలోని ఓ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. యాదమర్రి మండలం మొద్దనపల్లిలో అమర్‌రాజా పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో ఈ చోరీ జరిగింది.
15 కేజీల బంగారం, రూ.2.66 వేల నగదు చోరీ జరిగినట్లు సమాచారం. వీటి మొత్తం విలువ మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
undefined
బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు. బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్ పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. నగదు, నగలు మాయంపై బ్యాంక్ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలు సక్రంగా పనిచేస్తున్నప్పటికీ.. ఈ వ్యవస్థను కంట్రోల్ చేసే కంప్యూటర్‌ను దుండగులు ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్దిపాటి ఆధారాల సాయంతో చోరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండొచ్చనే భావిస్తున్నారు.